: లాడెన్ పోర్న్ అడిక్ట్... విచ్చలవిడితనం కోసమే యువత ఐఎస్ఐఎస్ లో చేరుతున్నారు: లండన్ మాజీ మేయర్
అల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ పోర్న్ అడిక్ట్ అని లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ తెలిపారు. లండన్ లో ఆయన మాట్లాడుతూ, లాడెన్ ను మట్టుబెట్టిన సందర్భంగా పాకిస్థాన్ లోని అబాటోబాద్ లోని ఆయన నివాసం నుంచి పెద్ద ఎత్తున పోర్న్ సీడీలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పోర్న్ సినిమాల నేపథ్యంలో విచ్చలవిడితనం కోసమే యువత ఐఎస్ఐఎస్ లో చేరుతున్నారని ఆయన ఆరోపించారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులు కూడా బోస్టన్, లాస్ వేగాస్, ఫ్లోరిడాల్లో ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడ్డట్టు తమ దర్యాప్తులో తేలిందని అమెరికా భద్రతాధికారులు తెలిపారు. జిహాదీల ల్యాప్ టాప్ ల నిండా పోర్న్ సినిమాలే ఉన్నాయని అమెరికా ఇంటలిజెన్స్ మాజీ డైరక్టర్, లెఫ్టెనెంట్ జనరల్ మైఖేల్ ఫ్లైన్ వెల్లడించారు. జీహాద్ అంటూ అవాకులు చవాకులు చెప్పే ఉగ్రవాదులను ఆయన సైకోపాత్ లుగా అభివర్ణించారు. వారిని వీలైనంత త్వరగా మట్టుబెట్టాలని ఆయన సూచించారు.