: ప్రేమించిన నేరానికి.. అబ్బాయి ముక్కు, చెవులు కోసేశారు!


పెద్దలకు ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకున్నారనే కారణంగా సొంత బిడ్డలను సైతం హతమార్చే పరువు హత్యలు పాకిస్థాన్ లో తరచుగా జరుగుతుంటాయి. తాజాగా, పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ప్రేమించిన అమ్మాయితో పారిపోయిన ఒక అబ్బాయిని పట్టుకుని అతని ముక్కు, చెవులను అమ్మాయి కుటుంబసభ్యులు కోసేశారు. జాంగ్ జిల్లాకు చెందిన ఇరవై సంవత్సరాల అమ్మాయి తన బంధువైన ఇమ్రాన్ అలీని ప్రేమించింది. అయితే, వీరి వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో వాళ్లిద్దరూ పారిపోయారు. ఈ సంఘటన జరిగిన కొన్నిరోజుల తర్వాత అమ్మాయి తరపు బంధువులు ఆమెను వెతికి పట్టుకుని ఇంటికి తీసుకువచ్చారు. తమకు పెళ్లి చేసేందుకు కుటుంబసభ్యులు ఒప్పుకున్నారని చెప్పమంటూ గత సోమవారం ఆ అమ్మాయితో బలవంతంగా అబ్బాయికి ఫోన్ చేయించారు. ఈ మాటలు నిజమేనని నమ్మిన అలీ వాళ్ల ఇంటికి వెళ్లడంతో అతన్ని తాడుతో కట్టేసి, తీవ్రంగా కొట్టడమే కాకుండా అతని ముక్కు, చెవులు కోసేశారు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఇమ్రాన్ అలీని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News