: 'సూపర్ యాక్టివ్ సీఎం'... చంద్రబాబుపై కేంద్రమంత్రి పీయూష్ ప్రశంసలు!
దక్షిణాది రాష్ట్రాల్లో చంద్రబాబు మినహా ఏ సీఎం తనతో సమావేశమయ్యేందుకు పెద్దగా ఆసక్తి కనపర్చరని, సూపర్ యాక్టివ్ సీఎం చంద్రబాబు అని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారు. కేంద్రం నుంచి ఏపీకి ప్రయోజనాలు పొందే లక్ష్యంతో సీఎం చంద్రబాబు తమతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుంటారని అన్నారు. ప్రభుత్వం నూతన విధానాలు ప్రకటించిన మర్నాడే ఏపీ సీఎం చంద్రబాబు, రాజస్థాన్ సీఎం వసుంధర రాజే తమతో చర్చించారని ఆయన చెప్పారు. విద్యుత్ రంగంలో ఏపీ శరవేగంగా దూసుకుపోతోందని, ఏడాదిలోనే మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఎదిగిందన్నారు.