: సొంత వదినపై టీవీ నటి శ్రీవాణి రౌడీయిజం!


పలు సీరియల్స్ లో నటించే టీవీ నటి శ్రీవాణి రౌడీయిజం ప్రదర్శించింది. సొంత అన్న భార్య అనూషపై దౌర్జన్యానికి దిగింది. రంగారెడ్డి జిల్లా పరిగిలో నివాసం ఉండే శ్రీవాణి సోదరుడు బాబ్జీ కొంత కాలం క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అన్న ఇంట్లో తనకూ వాటా ఉందని వాదిస్తూ శ్రీవాణి వదినతో ఘర్షణకు దిగింది. తన భర్త ఆదిత్యరెడ్డి సాయంతో ఆ ఇంటిని కూల్చివేసింది. ఈ సందర్భంగా అడ్డుకున్న తనను శ్రీవాణి కొట్టిందని ఆమె వదిన ఆరోపించారు. దీనిపై ఆమె వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు 428 ఏ, 452, 427 (34డి) సెక్షన్లపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News