: 332 కిలోల భారీ సమోసా... యువకుడి గిన్నిస్ ప్రయత్నం!


నేటి యువతరం గుర్తింపును కోరుకుంటోంది. ఆ క్రమంలో వినూత్నమైన ప్రయోగాలు చేయడానికి యువకులు పూనుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లాలోని గోపాల్ నగర్ కాలనీకి చెందిన రితేశ్ సోని అనే యువకుడు ఇంటర్ పూర్తిచేసి సొంత ఊరిలో చిన్నపాటి సమోసాల దుకాణం నడుపుతున్నాడు. తన సమోసాలకు గిరాకీ పెంచుకునేందుకు ఏం చేయాలా? అని ఆలోచించిన రితేశ్ సోనీకి 'పెద్ద సమోసా' ఐడియా తట్టింది. వెంటనే సమోసాల చరిత్రపై ఇంటర్నెట్ వెతకగా, ఇంగ్లాండ్ లోని బ్రాడ్ ఫోర్డ్ కాళాశాల విద్యార్థులు రూపొందించిన 110 కేజీల సమోసా ఇప్పటివరకు గిన్నిస్ రికార్డులకెక్కిన అతిపెద్ద సమోసా అని తెలుసుకున్నాడు. దీంతో అంతకంటే పెద్ద సమోసాను తయారు చేసి, గిన్నిస్ రికార్డులకెక్కడంతో పాటు 'పెద్ద సమోసా దుకాణం'గా తన దుకాణానికి పేరు తీసుకురావాలని భావించాడు. దీంతో స్నేహితుల సాయంతో గిన్నిస్ రికార్డు ప్రయత్నం ప్రారంభించాడు. ఇందుకోసం 90 లీటర్ల రిఫైన్డ్ ఆయిల్, 1.75 క్వింటాళ్ల గోధుమ పిండి, రెండు క్వింటాల బంగాళాదుంపలు ఉపయోగించి, 3 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, రెండు మీటర్ల మందం కలిగిన 332 కేజీల భారీ సమోసాను తయారుచేశాడు. దీనిని తయారు చేసేందుకు 40 వేల రూాపాయలు ఖర్చయ్యాయని రితేశ్ తెలిపాడు. అయితే దీనిపై గిన్నిస్ రికార్డు అధికారులకు సమాచారం అందించామని, తమ సమోసా 'ప్రపంచంలోనే అతిపెద్ద సమోసగా' గుర్తింపు పొందుతుందని రితేశ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News