: చిన్నల్లుడిని యాక్టింగ్ క్లాసులకు వెళ్లమన్న మెగాస్టార్ చిరంజీవి?
మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ చిత్ర పరిశ్రమలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ముందుగా యాక్టింగ్ క్లాసులకు వెళ్లి శిక్షణ తీసుకోవాలని, ఫిజిక్, లుక్ లో కూడా కొద్దిపాటి మార్పులు అవసరమని మెగాస్టార్ తన అల్లుడికి సూచించారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే కల్యాణ్ హీరోగా వస్తున్న వార్తలను శ్రావణమాసంలో ప్రకటించవచ్చని తెలుస్తోంది.