: ప్రముఖ సాహితీవేత్త గూటాల కృష్ణమూర్తి కన్నుమూత
ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గూటాల కృష్ణమూర్తి కన్నుమూశారు. విశాఖపట్టణంలో ఆయన మృతి చెందినట్లు కృష్ణమూర్తి కుటుంబసభ్యులు చెప్పారు. కాగా, శ్రీశ్రీ 'మహాప్రస్థానం' గీతాలను ఆయన చేతే పాడించి, రికార్డ్ చేసి తెలుగు ప్రజలకు అందించిన ఘనత గూటాలది. ఎందరో సాహితీవేత్తలకు ఆయన ఇల్లు విడిదిగా ఉండేది. లండన్ లో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా ఆయన పనిచేశారు. 1928 జులై 10న విశాఖజిల్లాలోని పర్లాకిమిడిలో ఆయన జన్మించారు. 1962 లో లండన్ వెళ్లి అక్కడే పలు విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ గా పనిచేశారు. అప్పట్లో తెలుగు ప్రముఖులు, సాహితీవేత్తలు ఎవరైనా లండన్ వెళితే ఆయన నివాసమే విడిదిగా ఉండేదట!