: క్యాంపు ఆఫీస్ లో మొక్కలు నాటిన కేసీఆర్, కేటీఆర్, హిమాన్ష్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు హరిత హారంలో పాల్గొన్నారు. హైదరాబాదులోని సీఎం క్యాంపు ఆఫీసు కార్యాలయంలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్, ఆయన కుమారుడు హిమాన్ష్ లు రాశి, నక్షత్రం ఆధారంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు కూడా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా, తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు చేపట్టిన హరితహారం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.