: తమిళనాడు ప్రజలకు త్వరలో అందనున్న ఉచిత వైఫై
తమిళనాడులోని పబ్లిక్ ప్రదేశాల్లో ఉచిత వైఫై పథకానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. సెప్టెంబర్ లో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు తమిళనాడు ప్రభుత్వ కేబుల్ టీవీ సంస్థ ఇందుకోసం ఏర్పాట్లు ప్రారంభించనుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ, మొదటి విడతగా తమిళనాడులోని 32 జిల్లాల్లోని ప్రధాన ప్రాంతాల్లో ఉచిత వైఫై సౌకర్యాన్ని ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. బస్టాండ్లు, పార్కులు, ప్రభుత్వ షాపింగ్ కాంప్లెక్స్ వంటి రద్దీ ప్రాంతాల్లో ఉచిత వైఫై అందుబాటులోకి రానుందని, ఈ పథకం కోసం ఏజెంట్ల ద్వారా టెండర్లను కోరామన్నారు.