: మోడల్ అవతారమెత్తిన హీరో అఖిల్... ట్విట్టర్ లో ఫోటోలు!
యువహీరో అఖిల్ అక్కినేని మరోసారి మోడల్ అవతారమెత్తాడు. నాగార్జున ఫ్యామిలీ ఫ్రెండ్, ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి డిజైన్ చేసిన ఎథినిక్ వేర్ కోసం అఖిల్ మోడల్ గా మారాల్సి వచ్చిందని అఖిల్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. ఆమె డిజైన్ చేసిన దుస్తులు ధరించి ప్రత్యేక షూట్ లో పాల్గొన్నానని, ఆ డిజైన్స్ తనకు అద్భుతంగా ఉన్నాయని తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశాడు. కాగా, శ్రేయా భూపాల్ అనే డిజైనర్ తో ప్రేమలో పడ్డ అఖిల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడంటూ ఫిల్మ్ నగర్ లో వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.