: ఎన్టీఆర్ హెల్త్ కార్డులను నిరాకరించే ఆస్పత్రులపై కఠిన చర్యలు: మంత్రి కామినేని
ఎన్టీఆర్ హెల్త్ కార్డులను నిరాకరించే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తప్పవని ఏపీ ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. రాజమహేంద్ర వరం జిల్లా ఆసుపత్రిలో మంత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. పలువార్డుల్లో రోగులను ఆయన పలకరించి, అక్కడ అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వాసుపత్రుల తీరు మెరుగ్గా ఉందన్నారు. ఎన్టీఆర్ హెల్త్ కార్డులు ఉన్న నిరుపేదలకు వైద్యం నిరాకరించే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని కామినేని అన్నారు.