: ఈ ఫొటోతో నాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి: హీరోయిన్ శ్రియ


ప్రస్తుతం తమిళ చిత్రం ‘ఎఎఎ’లో నటుడు శింబు సరసన శ్రియ నటిస్తోంది. తమిళనాడులోని దిండిగల్ లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా సెట్ లోని ఒక పాత కారుపై కూర్చొని దిగిన ఫొటోను శ్రియ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో శ్రియ చక్కని చీరకట్టులో దర్శనమిచ్చింది. ఈ ఫోటో తాము వాడిన 'ఆర్ఎన్ డీ 5761' నెంబరు గల తొలికారును గుర్తుకు తెస్తోందని, నాటి జ్ఞాపకాలను, విహారయాత్రలను, డ్రైవింగ్ నేర్చుకున్న రోజులు గుర్తుకు వస్తున్నాయని ఆ ట్వీట్ లో పేర్కొంది. కాగా, ప్రముఖ నటుడు బాలక‌ృష్ణ 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో బాలయ్య సరసన శ్రియ నటిస్తోంది.

  • Loading...

More Telugu News