: కులాంతర వివాహాలే కొంపముంచుతున్నాయి... దళితులకు ఆయుధాలు ఇచ్చే ఆలోచన చేస్తున్నాం!: కేంద్ర మంత్రి అథావలే సంచలన వ్యాఖ్య


దళితులు, అగ్రవర్ణాల యువత మధ్య పుడుతున్న ప్రేమ, జరుగుతున్న కులాంతర వివాహాలే దళితులపై దాడులు పెరగడానికి కారణమవుతున్నాయని కేంద్ర మంత్రి రామ్ దాస్ అథావలే వ్యాఖ్యానించారు. తమ బిడ్డల ప్రేమ వివాహాలను జీర్ణించుకోలేకపోతున్న అగ్రకులస్తులు దళితులపై దాడులకు పురికొల్పుతున్నారని, వారికి చట్టప్రకారం ఆయుధాలను ఇవ్వాలని కోరారు. దళితుల ప్రాణాలను కాపాడేందుకు సామాజిక న్యాయ శాఖ సహాయమంత్రిగా, ఆయుధాలు ఇచ్చే విషయంలో ఆలోచనలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు హోం శాఖతో చర్చిస్తానని అన్నారు. తాను గతంలోనే ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు గుర్తు చేసిన ఆయన, ఇప్పుడు మరింత గట్టిగా ప్రయత్నిస్తానని అన్నారు.

  • Loading...

More Telugu News