: సుప్రీం తీర్పు మోదీ, అమిత్ షాలకు చెంపదెబ్బ... క్షమాపణ చెప్పాలి: రాహుల్ గాంధీ
అరుణాచల్ ప్రదేశ్ లో దొడ్డిదారిన అధికారంలోకి రావాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు పన్నిన పన్నాగం విఫలమైందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. సుప్రీం తీర్పు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు చెంపదెబ్బ వంటిదని అభిప్రాయపడ్డ ఆయన, చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని నిలిపినందుకు సుప్రీంకోర్టుకు రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో మోదీ తెలుసుకోవాలని హితవు పలికారు.