: ఒక్కసారిగా లక్ష క్యూసెక్కులు దాటిన ఆల్మట్టి వరద... మరో 20 అడుగులు పెరిగితే శ్రీశైలానికి నీరు


నిన్న మధ్యాహ్నం నుంచి కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదిలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. నిన్నటివరకూ ఆల్మట్టి డ్యామ్ కు 10 నుంచి 18 వేల క్యూసెక్కుల నీరు రాగా, ఈ ఉదయం వరద ప్రవాహం లక్షా 20 వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో మధ్యాహ్నం 12 గంటల సమయానికే 1,705 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టం సామర్థ్యమున్న ప్రాజెక్టులో 1,685 అడుగులకు నీరు చేరుకుంది. మరో 20 అడుగుల మేరకు నీరు చేరితే, ఆపై వచ్చే నీరంతా కిందకు వదలక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. డ్యామ్ నిండే పరిస్థితులు కనిపిస్తుండటంతో, ముందు జాగ్రత్త చర్యగా 20 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, కడెం ప్రాజెక్టు వద్ద ఇన్ ఫ్లో 17,801 క్యూసెక్కులు ఉండగా, 14,340 క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 32,983 క్యూసెక్కులు, ఎస్సారెస్పీ ప్రాజెక్టులో 67,117 క్యూసెక్కుల వరదనీరు వస్తుండగా, తుంగభద్ర ప్రాజెక్టుకు 11,750 క్యూసెక్కుల నీరు వస్తోంది.

  • Loading...

More Telugu News