: ఆత్మాహుతి దాడులు నిరభ్యంతరంగా చేయొచ్చు: జకీర్ నాయక్ సంచలనాత్మక వీడియో బట్టబయలు!


పీస్ టీవీ నిర్వహిస్తూ, ముస్లిం మత ప్రచారకర్తగా పరిచయమైన జకీర్ నాయక్ ఏ విధమైన విద్వేషపూరిత వ్యాఖ్యలూ చేయలేదని చెబుతూ, ఆయన్ను అరెస్ట్ చేసే ఉద్దేశం తమకు లేదని మహారాష్ట్ర పోలీసులు స్పష్టం చేసిన వేళ, జకీర్ పాత వీడియో ఒకటి వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. ఆత్మాహుతి దాడులపై ఆయన చేసిన వ్యాఖ్యలు, జకీర్ వైఖరిపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో జకీర్ ప్రసంగిస్తుండగా, ఓ వ్యక్తి, "ఏదైనా పరిస్థితిలో ఆత్మాహుతి దాడి జరిపితే దాన్ని ఇస్లాం మతం అంగీకరిస్తుందా?" అని ప్రశ్నించాడు. దీనికి "అవును" అంటూ, ఆత్మాహుతిదాడికి ఇస్లాం మద్దతిస్తుందని, అవసరమనుకుంటే నిరభ్యంతరంగా దాడి చేయవచ్చని బహిరంగంగానే సూసైడ్ బాంబింగ్ కు అనుకూల వ్యాఖ్యలు చేశాడు.

  • Loading...

More Telugu News