: జకీర్ ను చంపితే రూ.15 లక్షల నజరానా!... సంచలన ప్రకటన చేసిన ‘హుస్సేనీ టైగర్స్’!


బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రదాడితో ఇస్లామిక్ వివాదాస్పద మత గురువు జకీర్ నాయక్ చుట్టూ పెను వివాదమే రేగింది. ఇస్లామిక్ మత బోధనల పేరిట ‘పీస్ టీవీ’లో ఆయన చేస్తున్న ఉద్రేకపూరిత ప్రసంగాలు ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు పయనించేలా చేస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్న ఆయన భారత్ కు వచ్చేందుకు సిద్ధపడినా... అరెస్ట్ చేస్తారన్న భయంతో వెనకడుగు వేశారు. తాజాగా ముస్లింలలోనే ఓ వర్గంగా ఉన్న షియాలు ఆయనను అంతమొదించేందుకు కుట్రలు చేస్తున్నారు. ఈ క్రమంలో షియా గ్రూపునకు చెందిన ‘హుస్సేనీ టైగర్స్’ అనే సంస్థ జకీర్ ను చంపిన వారికి రూ.15 లక్షలు బహుమతిగా అందజేస్తామని ప్రకటించింది. జకీర్ ను ‘ఖల్ నాయక్’గా అభివర్ణించిన హుస్సేనీ టైగర్స్... ముస్లిం ప్రవక్తను అవమానపరిచారని జకీర్ పై ఆరోపణలు గుప్పించారు. హుస్సేనీ టైగర్స్ సంస్థ ప్రతినిధిగా ఈ ప్రకటనను విడుదల చేసిన సయ్యద్ కల్బే హుస్సేన్ నఖ్వీ... ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సీనియర్ వైస్ ప్రసిడెంట్ సయ్యద్ కల్బే సాదిక్ కుమారుడు కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News