: 'ఆదాయపు పన్ను' ఉద్యోగాన్ని వదులుకున్న కేజ్రీవాల్ భార్య సునీత


దాదాపు 22 సంవత్సరాలుగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) ఉద్యోగిగా, ఆదాయపు పన్ను శాఖలో పనిచేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత, స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఐటీ అపిలేట్ ట్రైబ్యునల్ లో కమిషనర్ గా ఉన్న ఆమె, ఈ సంవత్సరం ప్రారంభంలోనే వీఆర్ఎస్ తీసుకునేందుకు దరఖాస్తు చేయగా, సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) ఇప్పుడు ఆమోదం తెలిపింది. ఈ నెల 15న ఆమె పదవీ విరమణ చేయవచ్చని సీబీడీటీ వెల్లడించింది. 20 సంవత్సరాలకు పైగా సేవలందించిన కారణంగా, ఆమె అన్ని పెన్షన్ లాభాలనూ అందుకోనున్నారని అధికారులు వివరించారు. ఆప్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న రాజకీయ పోరులో తనను బలిచేయవచ్చన్న భయంతోనే ఆమె వీఆర్ఎస్ కోరుకున్నట్టు తెలుస్తోంది. కాగా, 51 సంవత్సరాల సునీత 1993లో ఐఆర్ఎస్ కు ఎంపికయ్యారు. ఆపై 1995లో ఐఆర్ఎస్ అధికారిగా ఎంపికైన కేజ్రీవాల్ ను ఓ శిక్షణా కార్యక్రమంలో భాగంగా భోపాల్ లో కలిశారు. వీరి పరిచయం ప్రేమగా మారడంతో ఆపై వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News