: నిర్మాత చదలవాడపై భూ కబ్జా కేసు


ప్రముఖ సినీ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుపై మెదక్ జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తన 1000గజాల స్థలాన్ని చదలవాడ శ్రీనివాసరావు ఆక్రమించాడంటూ ఉమాపతి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రామచంద్రాపురం పోలీసులు చదలవాడపై కేసు నమోదు చేశారు. కాగా, ఈ నిర్మాతపై సెక్షన్ 447 కింద కేసు నమోదైనట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News