: గవర్నర్ కు ఎదురుదెబ్బ... అరుణాచల్ ప్రదేశ్ సంక్షోభంపై సుప్రీం సంచలన తీర్పు


అరుణాచల్ ప్రదేశ్ లో నెలకొన్న సంక్షోభంపై కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని తీర్పిస్తూ, రెబల్స్ కు షాకిచ్చింది. గతంలో ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందని అభిప్రాయపడింది. గవర్నర్ నిర్ణయాన్ని కొట్టేస్తున్నట్టు తెలిపింది. దీంతో మరోసారి సీఎం పదవిని చేపట్టేందుకు నబామ్ తుకీకి అవకాశం లభించినట్లయింది. సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్, నబామ్ తిరిగి పాలనా పగ్గాలు చేపట్టి సుపరిపాలన అందిస్తారని ప్రకటించింది.

  • Loading...

More Telugu News