: న్యూజర్సీ గుడిలో కేసీఆర్ సతీమణి శోభ


తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సతీమణి శోభ యూఎస్ పర్యటనలో భాగంగా న్యూజర్సీలోని శ్రీ గురువాయురప్పన్ దేవాలయాన్ని సందర్శించారు. ఆమెకు శాలువా కప్పి సంప్రదాయ స్వాగతం పలికిన దేవాలయ అధికారులు, ప్రత్యేక పూజలు చేయించారు. ఆపై ఆమె మాట్లాడుతూ, దేవాలయం ఎంతో ప్రశాంతంగా ఉందని, ఇక్కడ పూజలు చేయించడం తనకెంతో మనశ్శాంతిని ఇచ్చిందని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. శోభ దేవాలయ సందర్శన వీడియోను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News