: కొత్త రైలు భలేగా ఉందన్న జేసీ దివాకర్ రెడ్డి

రాయలసీమను అమరావతి ప్రాంతానికి కలుపుతూ నిన్న ప్రారంభించిన విజయవాడ - ధర్మవరం ఎక్స్ ప్రెస్ రైలు ఈ ఉదయం గమ్యానికి చేరుకోగా, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్వాగతం పలికారు. రైలులోని ప్రతి బోగీనీ పరిశీలించారు. రైలులో ఏర్పాట్లు బాగున్నాయని, సీటింగ్ సౌకర్యవంతంగా ఉందని అన్నారు. సుఖవంతమైన ప్రయాణం కోసం కొత్త తరహా టెక్నాలజీతో తయారైన బోగీలతో రైలుందని తెలుసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. సీమ ప్రజలు ఇటువంటి రైలు కోసం చానాళ్లుగా ఎదురుచూస్తున్నారని, ఇకపై రాత్రి బయలుదేరి రాజధానికి వెళ్లి, పని చూసుకుని తిరిగి సాయంత్రం బయలుదేరి ఊరికి వచ్చేయవచ్చని జేసీ అన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజల కోరికను తీర్చినందుకు రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.