: గోదావరి ఉప్పొంగుతున్న వేళ, కదిలిన కృష్ణమ్మ!


రెండు సంవత్సరాల వరుస కరవు పరిస్థితులను ఎదుర్కొన్న తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఓ వైపు గోదావరి నది వరద ఉద్ధృతితో ఉప్పొంగుతుంటే, కృష్ణానది కదిలింది. కర్ణాటక, మహారాష్ట్రల్లో వర్షాలతో ఆల్మట్టికి నీరు చేరుతోంది. ప్రస్తుతం ఆల్మట్టికి వస్తున్న వరదనీరు దాదాపు 90 వేల క్యూసెక్కులుగా ఉండగా, ఉపనదుల్లో నీటి మట్టం అధికంగా ఉండటంతో రెండు రోజుల్లో వరద మరింతగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆల్మట్టిలోకి మరో 60 టీఎంసీల నీరు చేరితే, ఆపై వచ్చేదంతా కిందకు వదలక తప్పనిసరి పరిస్థితి. ఇదిలావుండగా, ఈ ఉదయం దవళేశ్వరం వద్ద దాదాపు 14 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. ఇది 15 లక్షల క్యూసెక్కులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ కానుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే పలు లంక గ్రామాల్లోకి వరదనీరు చేరడంతో, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో 50 గ్రామాల్లోకి వరదనీరు చేరింది.

  • Loading...

More Telugu News