: మునుగోడు మాజీ ఎమ్మెల్యే మృతికి కేసీఆర్ సంతాపం


నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు ఎన్నికైన సీపీఐ కురువృద్ధుడు, సీనియర్ రాజకీయవేత్త ఉజ్జిని నారాయణరావు మృతికి టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. కేన్సర్ సోకిన కారణంగా చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉజ్జిని నేటి ఉదయం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే కన్నుమూశారు. ఉజ్జిని మృతి వార్త తెలియగానే కేసీఆర్ వేగంగా స్పందించారు. ఉజ్జిని మృతికి ఆయన సంతాపం ప్రకటించారు. ఈ మేరకు సీఎంఓ ఓ ప్రకటనను విడుదల చేసింది.

  • Loading...

More Telugu News