: అరెస్టైన యాసీర్... హైదరాబాదు ఐఎస్ చీఫేనట!: నేషనల్ మీడియా కథనం!
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)కు భాగ్యనగరి హైదరాబాదులో ప్రత్యేక విభాగముందట. హైదరాబాదుతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో పెను విధ్వంసానికి కుట్ర పన్నిన ఐదుగురు ఐఎస్ ఉగ్రవాదులను ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నిన్న నగరంలోని మొఘల్ పురా, బండ్లగూడల్లో ముమ్మర సోదాలు చేసిన పోలీసులు మరో ఇద్దరు ఐఎస్ సానుభూతిపరులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరిలో ఒకడైన యాసీర్ నాయమతుల్లా... మొత్తం హైదరాబాదులోని ఐఎస్ నెట్ వర్క్ కు చీఫ్ గా వ్యవహరిస్తున్నాడట. ఈ మేరకు జాతీయ మీడియాలో ఓ సంచలన కథనం వెలుగుచూసింది. ఇక యాసీర్ తో పాటు పట్టుబడ్డ అహ్మదుల్లా రెహ్మాన్ ఐఎస్ కార్యకలాపాలకు అవసరమైన నిధుల సేకరణతో పాటు యువతను ఉగ్ర కార్యకలాపాల వైపు మొగ్గేలా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ మేరకు తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరోలోని అత్యంత విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ నేషనల్ మీడియా సదరు కథనాన్ని రాసింది.