: నాడు పాదయాత్రలో చంద్రబాబుతో... నేడు నరహంతకుడిగా కటకటాల్లో!


నెల్లూరు ప్రాంతంలో సైకోగా మారి వరుస హత్యలతో కలకలం సృష్టించి పోలీసులకు పట్టుబడ్డ కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేశ్ నేపథ్యం పరిశీలించిన పోలీసులకు పలు వాస్తవాలు తెలిశాయి. జిల్లాలోని యర్రబొట్లపల్లి అనే గ్రామానికి చెందిన వెంకటేశ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, చంద్రబాబుకు వీరాభిమాని అని తెలుస్తోంది. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు పాదయాత్ర చేస్తున్న వేళ, పచ్చ కండువా కప్పుకుని చంద్రబాబుతో కలిసి నడుస్తూ ఫోటోలు తీయించుకుని తన ఫేస్ బుక్ ఖాతాలో అప్ లోడ్ చేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, ఉన్నతాధికాలకు తెలియజేయడంతో, ఆపై కాసేపటికే వెంకటేశ్ ఫేస్ బుక్ ఖాతా ఇంటర్నెట్ నుంచి మాయమైంది. అప్పటికే చంద్రబాబు, వెంకటేశ్ కలిసున్న చిత్రాలు మరిన్ని సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కాయి. కాగా, ఒంటరిగా ఉండే మహిళలు, వృద్ధులే లక్ష్యంగా వారి ఇళ్లలోకి ప్రవేశించి సుత్తితో తలపై మోది హత్యలు చేస్తున్న వెంకటేశ్, గత నెల వ్యవధిలో నాలుగు హత్యలు చేశాడు. ప్రస్తుతం కేసును మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News