: వచ్చే ఏడాది దాకా జకీర్ భారత్ కు రారట!... వివాదాస్పద మత గురువు లాయర్ ప్రకటన!


ఇస్లామిక్ బోధనలతో యువతను ఉగ్రవాదం వైపు మళ్లేలా ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మత గురువు జకీర్ నాయక్ ఇప్పుడప్పుడే భారత్ కు వచ్చే అవకాశాలు లేవు. వచ్చే ఏడాది దాకా ఆయన భారత్ లో అడుగుపెట్టరని ఆయన తరఫు న్యాయవాది ముబిన్ సోల్కర్ నిన్న ముంబైలో ప్రకటించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రదాడిలో అరెస్టైన ముష్కరుడు... తాను జకీర్ ప్రసంగాలతోనే ఉత్తేజితుడనయ్యానని చెప్పిన నేపథ్యంలో ఒక్కసారిగా జకీర్ చుట్టూ వివాదం రేగింది. ఈ క్రమంలో ఆయనపై మహారాష్ట్ర పోలీసులతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కూడా దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో జకీర్ నాయక్ భారత్ లో అడుగుపెట్టగానే అరెస్ట్ ఖాయమన్న వాదన వినిపించింది. ఈ క్రమంలో మొన్ననే భారత్ కు తిరిగి వస్తున్నానంటూ జకీర్ ప్రకటించినా.. అయితే అరెస్ట్ వార్తలతో ఆయన వెనకడుగు వేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారమే జకీర్ విదేశాల్లో ఉన్నారని, ఈ షెడ్యూల్ వచ్చే ఏడాది దాకా ఉందని, ఆ తర్వాతే జకీర్ తిరిగి వస్తారని ముబిన్ చెప్పారు. జకీర్ పై ప్రారంభమైన దర్యాప్తు ముగిసిన తర్వాత షెడ్యూల్ కుదింపుపై యోచిస్తామని కూడా ముబిన్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News