: మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణరావు కన్నుమూత!


సీపీఐ కురువృద్ధుడు, సీనియర్ రాజకీయ వేత్త, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉజ్జిని నారాయణరావు ఇక లేరు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉజ్జిని కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. కేన్సర్ సోకిన ఆయన ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు మే నెలలో హైదరాబాదులోని నిమ్స్ కు తరలించారు. చికిత్స కారణంగా ఆరోగ్యం కాస్తంత మెరుగవడంతో ఇటీవలే ఆయనను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లారు. అయితే ఉన్నట్టుండి మళ్లీ ఆయన ఆరోగ్యం విషమించడంతో తిరిగి నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ఆయన కొద్దిసేపటి క్రితం కన్నుముశారు.

  • Loading...

More Telugu News