: వైసీపీకి దగ్గరవుతున్న ఉండవల్లి!... జగన్ తో ఏకాంత చర్చలు ఇందుకేనా?


ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీలో విపక్షం వైసీపీకి క్రమంగా దగ్గరవుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇటీవల ఆయన చేసిన పలు వ్యాఖ్యలు, నిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లిన సందర్భంగా జరిగిన ఏకాంత చర్చలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. నిన్న రాజమహేంద్రవరం వెళ్లిన జగన్ నేరుగా ఉండవల్లి ఇంటికి వెళ్లారు. ఇటీవలే ఉండవల్లి తల్లి చనిపోయారు. ఈ నేపథ్యంలో ఉండవల్లిని పరామర్శించేందుకే జగన్ ఆయన ఇంటికి వెళ్లారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పరామర్శ సందర్భంగా ఉండవల్లితో జగన్ కొద్దిసేపు ఏకాంతంగా భేటీ అయ్యరు. ఈ చర్చల్లో రాజకీయ అంశాలే చర్చకు వచ్చినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నా... ఇటీవల పలు సందర్భాల్లో జగన్ ను సమర్ధిస్తూ ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు ఆ వాదనను కొట్టేస్తున్నాయి. జగన్ తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ఆప్తుడిగా పేరున్న ఉండవల్లి మళ్లీ రాజకీయపరంగా యాక్టివ్ అయితే మాత్రం జగన్ పార్టీకి కాస్తంత బలం చేకూరినట్టేనన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News