: హైదరాబాద్ లో మైనర్లకు మద్యం విక్రయిస్తున్న బార్లపై అధికారుల దాడులు


హైదరాబాద్ లో చిన్నారి రమ్య మృతి ఘటనతో ఆబ్కారీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలో మైనర్లకు మద్యం విక్రయిస్తున్న పలు బార్లపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లో ఉన్న పలు బార్లపై అధికారులు దాడులు చేపట్టారు. ఇప్పటివరకు నాలుగు బార్లలో తనిఖీలు నిర్వహించారు. ‘మైనర్లకు మద్యం విక్రయించం, బార్లలోకి ప్రవేశం లేదు’ అనే నోటీసు బోర్డులు బార్ల వద్ద అధికారులు ఏర్పాటు చేశారు. కాగా, మైనర్లకు మద్యం విక్రయించే బార్లు, వైన్ షాపులపై కఠిన చర్యలు తీసుకునేందుకు, ప్రతి బార్ లో తప్పనిసరిగా సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News