: సినిమాల్లోకి రాకముందు పార్టీలకు బాగా వెళ్లేవాడిని: హీరో నిఖిల్


సినిమాల్లోకి రాకముందు పార్టీలను బాగా ఎంజాయ్ చేసేవాడినని, సినిమాల్లోకి వచ్చిన తర్వాత తనపై బాధ్యత పెరిగిందని హీరో నిఖిల్ చెప్పాడు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనకు ఫుట్ బాల్ ఆట ఇష్టమని, ఇంట్లో ఉంటే ఆ మ్యాచ్ లు చూస్తూ కూర్చుంటానని, లేకపోతే, ఫుట్ బాల్ అంటే ఆసక్తి ఉన్న ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ కూర్చుంటానని, క్రికెట్ కూడా ఇష్టమేనని చెప్పాడు. తనకు అమ్మాయిలు, అబ్బాయిల్లో ఫ్రెండ్స్ ఉన్నారని, అందరితో తాను ఫ్రెండ్లీగా, జాలీగా ఉంటానని, ఎవరితోనూ ప్రత్యేకమైన రిలేషన్ షిప్ లేదని నిఖిల్ చెప్పాడు.

  • Loading...

More Telugu News