: ఆంధ్రప్రదేశ్ ను అవినీతి ప్రదేశ్ గా మారుస్తున్నారు: శ్రీకాంత్ రెడ్డి


పెట్టుబడుల పేరుతో వివిధ దేశాలు తిరుగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశాల నుంచి ఎన్ని పెట్టుబడులు తెచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పెట్టుబడుల ఆహ్వానం పేరుతో ఆంధ్రప్రదేశ్ ను అవినీతిప్రదేశ్ గా మారుస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఎందరో పెట్టుబడిదారులు ఉన్నప్పటికీ వారినందర్నీ వదిలి, విదేశీ పెట్టుబడుల కోసం పాకులాడడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. పెట్టుబడుల అంశంలో స్థానిక పారిశ్రామిక వేత్తలకు అవకాశం ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేకహోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు వాటంతట అవే వచ్చేవని ఆయన తెలిపారు. ప్రత్యేకహోదా కోసం పోరాడకపోవడం దారుణమని పేర్కొన్న ఆయన, ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల పేరుతో నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News