: రాజమహేంద్రవరం వెళ్లి ఉండవల్లిని పరామర్శించిన జగన్!
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను వైఎస్సార్సీపీ అధినేత జగన్ కలిశారు. ఇటీవల ఉండవల్లి తల్లి మరణించిన నేపథ్యంలో జగన్ రాజమహేంద్రవరం వెళ్లి ఉండవల్లిని పరామర్శించారు. జగన్ వెంట ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా ఉన్నారు. మాతృవియోగంతో బాధలో ఉన్న ఉండవల్లిని జగన్ పరామర్శించారని, వీరి భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని పార్టీ వర్గాలు ప్రకటించాయి. కాగా, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరెడ్డి అధికారంలో ఉండగా ఉండవల్లి ఆయనకు అత్యంత సన్నిహితుడిగా మెలగిన సంగతి తెలిసిందే.