: ఎయిర్ ఇండియాపై మండిపడ్డ అమీషా పటేల్


'ఎయిర్ ఇండియా... అదో చెత్త సంస్థ' అంటూ బాలీవుడ్ నటి అమీషా పటేల్ మండిపడింది. ‘భయ్యాజీ సూపర్ హిట్’ సినిమా షూటింగ్ నిమిత్తం బెనారస్ వెళ్లేందుకని ప్రముఖ నటులు సన్నీడియోల్, అర్షద్ వార్సీలతో కలిసి ఆమెకు ఎయిరిండియా విమానంలో బిజినెస్ క్లాసులో టిక్కెట్లు బుక్ చేశారు. అయితే, చివరి క్షణంలో ఎకానమీ క్లాసులో ఆ ముగ్గురు నటులు ప్రయాణం చేయాల్సి వచ్చింది. దీంతో, ఎయిర్ ఇండియాపై ఆమె మండిపడుతూ తన ట్విట్టర్ ఖాతాలో ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎయిర్ ఇండియా విమానాలు తరచుగా ఆలస్యంగా వస్తుంటాయంటూ, బిజెనెస్ క్లాసుకు బదులు ఎకానమీ క్లాసులో ప్రయాణించేలా చేస్తాయంటూ అమీషా పటేల్ వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News