: కొత్త రికార్డుల దిశగా 'సుల్తాన్'... 345 కోట్ల వసూళ్లు!


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ తాజా సినిమా 'సుల్తాన్' పేరుకు తగ్గట్టుగా 'సుల్తాన్'గా నిలిచింది. ఈద్ కానుకగా విడుదలయిన ఈ చిత్రం బాక్సాఫీసు కలెక్షన్లలో దూకుడు చూపిస్తోంది. ఈ నెల 7న విడుదలైన 'సుల్తాన్' దేశవిదేశాల్లో ఘన విజయం సాధించింది. దీంతో తొలివారంలో ఈ సినిమా సుమారు 345 కోట్ల రూపాయలు వసూలు చేసింది. భారతదేశంలో 252.5 కోట్ల రూపాయలు వసూలు చేసిన 'సుల్తాన్' విదేశాల్లో 92 కోట్ల గ్రాస్ సాధించిందని సమాచారం. ఈ విధంగా బాలీవుడ్ లో మొదటి వారంలో ఇంతవరకు ఏ సినిమా సాధించని ఘనతను 'సుల్తాన్' సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. పాకిస్థాన్, దుబాయ్, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో హిట్ టాక్ సొంతం చేసుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీంతో ఈ సినిమా యూనిట్ సంతోషంలో మునిగిపోయారు. ఇలాగే మరోవారం పాటు ఈ సినిమా ప్రదర్శితమైతే భారతీయ సినీ పరిశ్రమ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోతాయని ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News