: మల్లన్నసాగర్‌తో పాటు భూసేకరణ చేస్తున్న ప్రాంతాల్లో ఆందోళనలు చేపడతాం: ఉత్తమ్‌కుమార్
తెలంగాణలో తమ పార్టీకి పునర్‌వైభవం తీసుకురావడానికి కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా జిల్లా, మండల, గ్రామ కాంగ్రెస్ కమిటీల నియామకం మూడు నెలల్లో పూర్తి చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈరోజు తెలిపారు. ఈనెల 30 న ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం ఉంటుందని ఆయన చెప్పారు. అన్ని జిల్లాల్లోనూ పార్టీ పుంజుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మల్లన్నసాగర్ తో పాటు భూసేకరణ చేస్తున్న ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వ తీరుకి నిరసనగా ఆందోళనలు చేపడతామని ఉత్తమ్‌కుమార్ తెలిపారు. భూసేకరణ విషయంలో ప్రభుత్వం భేషజాలకు పోతోందని ఆయన వ్యాఖ్యానించారు.