: 'మూవ్ ఆన్ పాకిస్థాన్' తాజా డిమాండ్... షరీఫ్ ను దించి మిలటరీ పాలన కావాలట!


పాకిస్థాన్ లో కొత్త ప్రచారం మొదలైంది. నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని గద్దెదించి, సైనిక పాలన విధించాలని పలు నగరాల్లో పోస్టర్లు వెలవడం కలకలం రేపుతోంది. లాహోర్, కరాచీ సహా, ఫైసలాబాద్, క్వెట్టా, పెషావర్, హైదరాబాద్, రావల్పిండి తదితర నగరాల్లో 'మూవ్ ఆన్ పాకిస్థాన్' అనే పార్టీ ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. గత సంవత్సరం నవంబరులో ప్రధాని షరీఫ్, తాను పదవీ విరమణ చేస్తానంటూ ప్రకటించిన వేళ ఇదే పార్టీ, దాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఉద్యమమే చేయడం గమనార్హం. పాక్ లో సైనిక పాలన విధించాల్సిన సమయం వచ్చిందని 'మూవ్ ఆన్ పాకిస్థాన్' చీఫ్ ఆర్గనైజర్ అలీ హష్మీ వెల్లడించారు. ఆర్మీ జనరల్ రహీల్ షరీఫ్ ప్రభుత్వాన్ని చూసుకోవాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఈ పరిస్థితిని గమనిస్తున్న పాక్ రాజకీయ నిపుణులు, సైనికులు ఏదో కుట్ర జరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. సైన్యం నివసించే వివిధ నగరాల కంటోన్మెంట్ ప్రాంతంలో సైతం పోస్టర్లు వెలిశాయంటే, వారే స్వయంగా ఉద్యమం వెనకున్నారని ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News