: కనుచూపు మేరలో ఇంకేమీ క‌నిపించవు... సమాధులు తప్ప!


అక్క‌డికెళ్లి చూస్తే కనుచూపు మేరలో ఇంకేమీ క‌నిపించ‌వు.. అన్నీ స‌మాధులే క‌నిపిస్తాయి..! ఇప్ప‌టికే 50 లక్షల మంది సమాధులు అక్కడ ఉన్నాయి. దీంతో ప్ర‌పంచ‌ంలోనే అతి పెద్ద శ్మశానంగా అది రికార్డులకెక్కింది. అంతేకాదు, అక్క‌డ‌ ఏటా కొత్తగా 5 లక్షల స‌మాధులు పెరుగుతున్నాయ్‌. ఈ శ్మ‌శానం ఇరాక్ రాజధాని బాగ్దాద్ కు సుమారు 150 కిలోమీటర్ల దూరంలోని నజాఫ్ పట్టణంలో క‌న‌ప‌డుతుంది. దీన్ని వదీ అల్ సలామ్(శాంతి లోయ) అని పిలుస్తారు. ఈ ప్రాంతం ఒక‌ప్పుడు షియా ముస్లింల ప‌విత్ర న‌గ‌రం. షియాల మూడో అతిపెద్ద ప‌విత్ర న‌గ‌రం ఇదే. ఈ నగరంలో ఉన్న శ్మశానంలోనే షియాల మొదటి మతగురువుని ఖ‌న‌నం చేశారు. అందుకే దీన్ని వదీ అల్ సలామ్ అని అంటారు. ఆయ‌న స‌మాధికి ద‌గ్గ‌ర‌లోనే క్రీస్తు శ‌కం 600 సంవ‌త్స‌రం నాటి స‌మాధులు ఉండేవి. ఈ ప్ర‌దేశంలోనే భారీగా స‌మాధులు నిర్మించారు. రానురాను సున్నీ వ‌ర్గానికి చెందిన ఐసిస్ ఉగ్ర‌వాదుల దాడుల‌తో న‌జాఫ్ న‌గ‌రం ధ్వంస‌మ‌యిపోయింది. అయితే ఉగ్ర‌వాదులు శ్మ‌శానాన్ని మాత్రం ఏమీ చేయ‌కుండా విడిచిపెట్టారు.

  • Loading...

More Telugu News