: వచ్చే ఏడాది రణ్ వీర్, దీపికాల వివాహం!


బాలీవుడ్ ప్రేమికులు రణ్ వీర్, దీపికా పదుకొనేలు వచ్చే ఏడాది వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి విషయాలు మాట్లాడుకునేందుకు రణ్ వీర్, దీపికాలు తమ కుటుంబసభ్యులతో కలిసి త్వరలో ఆస్ట్రియా దేశానికి వెళ్లనున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. కాగా, వీళ్లిద్దరికీ ఇదివరకే నిశ్చితార్థమై పోయిందన్న వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల స్పెయిన్ లో జరిగిన ఐఫా అవార్డుల ప్రదానోత్సవంలో.. ‘నీ కన్నా సంతోషాన్ని ఇచ్చేది ఏదీ లేదు’ అంటూ రణ్ వీర్ దీపికతో అన్న మాటలే ఆయన ప్రేమకు నిదర్శనమని అభిమానులంటుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News