: రైతులకు శుభవార్త... మరింత గిట్టుబాటు ధర, పప్పుధాన్యాలు పండిస్తే బోనస్: కేంద్ర మంత్రిమండలి


వివిధ రకాల పంటలను పండిస్తున్న రైతులకు అందుతున్న కనీస మద్దతు ధరను సమీక్షించడంతో పాటు, పప్పుధాన్యాల పంటలు పండించడానికి ప్రోత్సాహం అందించేలా బోనస్ ఇచ్చే ప్రతిపాదనలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన నేడు సమావేశమైన మంత్రివర్గ సంఘం ఆర్థిక సలహాదారు నేతృత్వంలో ఓ కమిటీని నియమించాలని నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశానికి హాజరైన ఆహార మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు రైతులకు కనీస మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని వ్యాఖ్యానించారు. పప్పుధాన్యాలపై దీర్ఘకాల విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని, ప్రజలకు సరిపడా ధాన్యాలు ఇండియాలోనే పండాలంటే, రైతులకు బోనస్ ఇచ్చి ప్రోత్సహించాల్సి వుందని పాశ్వాన్ అభిప్రాయపడ్డారు. కాగా, ఈ కమిటీకి అరవింద్ సుబ్రమణియన్ నేతృత్వం వహిస్తారని, తాజా ప్రతిపాదనలపై చర్చించి రెండు వారాల్లో నివేదిక ఇస్తారని, ఆపై రెండు నుంచి మూడు నెలల వ్యవధిలో కేంద్రం నిర్ణయాలు వెలువడతాయని తెలిపారు. గత సంవత్సరం 17 మిలియన్ టన్నులుగా ఉన్న పప్పుధాన్యాల దిగుబడిని ఈ సంవత్సరం 20 మిలియన్ టన్నులకు చేర్చాలని మోదీ సర్కారు లక్ష్యంగా నిర్ణయించుకుందని వివరించారు.

  • Loading...

More Telugu News