: జమ్మూకాశ్మీర్‌లో చొర‌బాటుకి విఫ‌లయ‌త్నం చేసిన పాక్ ముష్క‌రులు


కాశ్మీర్‌లో జ‌రుగుతోన్న ఆందోళ‌న‌ల‌ను వాడుకుని భార‌త్‌లో దాడి చేయ‌డానికి పాకిస్థాన్ ముష్క‌రులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ స‌రిహ‌ద్దు మీదుగా జమ్మూకాశ్మీర్‌లో చొర‌బాటుకి పాక్ ముష్క‌రులు ప్ర‌య‌త్నించారు. అయితే, అప్ర‌మ‌త్త‌మ‌యిన బీఎస్‌ఎఫ్ బ‌ల‌గాలు వారిపై ఎదురుదాడికి దిగాయి. పాకిస్థాన్ ముష్క‌రుల‌కు, బీఎస్ఎఫ్ బ‌ల‌గాల‌కు మ‌ధ్య కొద్ది సేపు కాల్పులు కొన‌సాగాయి. ముష్క‌రుల‌ను స‌మ‌ర్థవంతంగా ఎదుర్కొన్న బ‌ల‌గాలు వారిని హ‌త‌మార్చాయి. భార‌త్, పాక్‌ స‌రిహ‌ద్దు వ‌ద్ద భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు.

  • Loading...

More Telugu News