: హైకోర్టు సమస్యపై చొరవ చూపండి.. కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రితో చర్చించిన ఎంపీ వినోద్
ఉమ్మడి హైకోర్టు విభజన అంశాన్ని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరికి వివరించానని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ తెలిపారు. తెలంగాణ న్యాయవాదుల సమస్యలపై ఆయన ఈరోజు ఢిల్లీలో పీపీ చౌదరితో చర్చించారు. అనంతరం వినోద్ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సమస్యను కేంద్రం ముందు ఉంచుతానని పీపీ చౌదరి హామీ ఇచ్చినట్లు తెలిపారు. సుప్రీంకోర్టుతో పాటు దేశంలో ఉన్న హైకోర్టుల్లో 500 మంది జడ్జిల నియామకాలు చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. వారి నియామకాలపై చొరవచూపాలని తాను పీపీ చౌదరికి విజ్ఞప్తి చేసినట్లు వినోద్ తెలిపారు.