: కాశ్మీర్ ఆందోళనలపై అమెరికా స్పందన... అది భారత్ వ్యక్తిగత వ్యవహారం అన్న అగ్రరాజ్యం!
హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ కాల్చివేతకు నిరసనగా కాశ్మీర్‌లో చెలరేగుతోన్న ఆందోళనలపై అగ్రరాజ్యం అమెరికా ఈరోజు స్పందించింది. ఇప్పటివరకు ఆందోళనల్లో సుమారు 30 మంది మృతి చెందారు. సుమారు 800 మంది గాయపడిన విషయం విదితమే. ఈ అంశంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఆందోళనల్లో 30 మంది మృతి చెందడం పట్ల తాము విచారం వ్యక్తం చేస్తున్నట్లు అమెరికా పరిపాలన అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. అయితే కాశ్మీర్ ఆందోళనల ఘటన భారతదేశ వ్యక్తిగత వ్యవహారం అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాబట్టి దీనిపై ఎటువంటి ప్రకటన చేయబోమని స్పష్టం చేశారు. కాగా, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి తమ దేశం మద్దతు ఇవ్వడానికి సిద్ధమేనని ఆయన చెప్పారు.