: సదావర్తి భూముల వేలం రద్దు చేయలేం: హైకోర్టు కీలక తీర్పు
అత్యంత విలువైన సదావర్తి భూముల వేలాన్ని రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ ను తెలుగు రాష్ట్రాల హైకోర్టు కొట్టివేసింది. వేలాన్ని ఆపాలంటూ తమ ముందుకు వచ్చిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం, వేలం నిలిపివేతకు తగిన కారణాలు లేవని అభిప్రాయపడింది. బ్రాహ్మణ సమాఖ్య తరఫున పిటిషన్ దాఖలు కాగా, వేలం నిలిపివేత దిశగా నిర్ణయం తీసుకునేలా సహేతుక కారణాలు చూపడంలో సమాఖ్య విఫలమైందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వేలాన్ని రద్దు చేయలేమని, అక్రమాలు జరిగినట్టు ఆధారాలతో వస్తే, మరోమారు పరిశీలించి విచారణ జరిపేందుకు అభ్యంతరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది.