: రియో ఒలింపిక్స్... కొన్ని ఆసక్తికర విషయాలు
మరి కొన్ని రోజుల్లో ప్రపంచ అతిపెద్ద క్రీడా సంరంభానికి తెరలేవనుంది. రియో డి జెనిరోలో ఆగస్టు 5 నుంచి 21 వరకు జరిగే ఒలింపిక్స్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. దక్షిణ అమెరికాలో తొలిసారి జరగనున్న ఈ వేడుకల గురించి కొన్ని ఆసక్తికర అంశాలు మీ కోసం.. 4,50,000: ఒలింపిక్స్‌లో పాల్గొననున్న దాదాపు 11 వేల మంది క్రీడాకారుల కోసం సిద్ధం చేసిన కండోమ్‌లు. అంటే ప్రతి ఒక్కరికి 41 అన్నమాట. మరో మాటగా చెప్పాలంటే రోజుకు రెండు. 17,000 : మొత్తం అథ్లెట్లు, అధికారుల సంఖ్య ఇది. 78,000: మరకానా స్టేడియం సామర్థ్యం. ఇక్కడే ఒలిపింక్ క్రీడల ప్రారంభోత్సవం, ముగింపు సంబరాలు నిర్వహించనున్నారు. 206: క్రీడల్లో పాల్గొనే దేశాల సంఖ్య 1: ఒలింపిక్ బ్యానర్ కింద తొలిసారిగా ఓ శరణార్థుల టీం పాల్గొనబోతోంది. 7.5 మిలియన్: అందుబాటులో ఉన్న టికెట్ల సంఖ్య. 16 కిలోమీటర్లు: ఒలింపిక్స్ కోసం పొడిగించిన భూగర్భ మెట్రో రైలు ప్రాజెక్టు దూరం. 4: క్రీడల కోసం నాలుగు జోన్లు ఏర్పాటు చేశారు. బర్రా డా టుజికాలోని ఒలింపిక్ పార్కు, కోపాకబానా బీచ్, మరకానా, ఉత్తరప్రాంతంలోని ఒలింపిక్ స్టేడియంలలో క్రీడలు జరగనున్నాయి. 25,000: క్రీడలను కవర్ చేయనున్న జర్నలిస్టుల సంఖ్య. 5,00,000: గేమ్స్‌ను తిలకించేందుకు వచ్చే టూరిస్టులు. 31: ఒలిపింక్ విలేజ్‌లోని టవర్ల సంఖ్య. గేమ్స్ తరువాత 3,604 అపార్ట్‌మెంట్లను విక్రయించనున్నారు. 60,000: ఒలిపింక్ విలేజ్‌లోని డైనింగ్‌హాల్‌లో రోజుకు వడ్డించే భోజనాలు. 5: భోజనశాలలో ఐదు జంబోజెట్ విమానాలు ఇట్టే అమరిపోగలవు. అంత పెద్దదన్న మాట. 80,000: ఒలింపిక్ గ్రామంలోని కుర్చీల సంఖ్య. 400: క్రీడల్లో ఉపయోగించనున్న ఫుట్‌బాళ్లు. 0: ఒలింపిక్స్‌లో బ్రెజిల్ ఫుట్‌బాట్ జట్టు ఒక్కసారి కూడా విజేత కాలేకపోయింది.