: ఆడాళ్లతో వేగడం కష్టం బాబూ!: 10 నెలల కాపురం తరువాత హర్భజన్ సింగ్
ఆడవాళ్లతో వేగడం చాలా కష్టమని క్రికెటర్ హర్భజన్ సింగ్ అంటున్నాడు. గత సంవత్సరం అక్టోబరులో గీతా బస్రాను వివాహం చేసుకున్న హర్భజన్, ఈ నెలాఖరులో తండ్రి కానున్నాడు. ఈ నేపథ్యంలోనే ఎటువంటి జాగ్రత్తలతో పిల్లలను ఎలా పెంచాలి? అన్న విషయమై ప్రీ-నాటల్ క్లాసులకు కూడా వెళుతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన హర్భజన్, గీతకు బ్రిటీష్ పౌరసత్వం ఉన్నందున, తన బిడ్డ ఇంగ్లండ్ లోనే పుడుతుందని, ఇప్పటికే తమ బిడ్డ కోసం షాపింగ్ మొదలు పెట్టానని సంబరంగా చెబుతున్నాడు. తానిప్పుడిప్పుడే ఆడాళ్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని, వారితో సమయం గడపడం చాలా కష్టమన్న విషయం తెలిసి వచ్చిందని సరదాగా చెబుతున్నాడు. భార్యాభర్తల మధ్య అవగాహన ఉంటే, కాపురం సాఫీగా సాగుతుందని సలహాలు కూడా ఇస్తున్నాడు.