: ముహూర్తం బాగాలేదన్న నారాయణ... సరేనన్న శిద్ధా!


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలోని వెలగపూడి సమీపంలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం ఐదవ భవనంలో బుధవారం నాడు మరో రెండు శాఖలు ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి ఈ రెండు శాఖలనూ సోమవారం నాడు రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు ప్రారంభించాల్సి వుంది. ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయిన తరువాత, మరో మంత్రి పి.నారాయణ, సోమవారం నాడు హస్తా నక్షత్రం, అష్టమి ఘడియలు ప్రవేశించడాన్ని వివరిస్తూ, ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసుకోవాలని శిద్ధాకు సూచించారు. బుధవారం నాడు దశమి వస్తుందని చెప్పారు. నారాయణ సూచనల మేరకు శిద్ధా 13కు శాఖల చాంబర్ల ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసుకున్నారు. కాగా, అదనంగా మునిసిపల్ శాఖ సిబ్బందిని రప్పిస్తున్న కారణంగా పనుల్లో వేగం మరింతగా పెరగనుందని నారాయణ వివరించారు.

  • Loading...

More Telugu News