: 'కబాలి' సెన్సార్ పూర్తి... రిలీజ్ తేదీ ప్రకటన
ప్రపంచ వ్యాప్తంగా రజనీకాంత్ అభిమానులు అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తున్న 'కబాలి' వచ్చేస్తోంది. నిన్న సెన్సార్ బోర్డుకు వెళ్లిన ఈ చిత్రానికి క్లీన్ 'యూ' సర్టిఫికెట్ లభించింది. ఆ వెంటనే 22న చిత్రం విడుదలవుతుందని నిర్మాత కలైపులి ఎస్ థాను ప్రకటించారు. నేటి నుంచి 'కబాలి' పండగ మొదలైందని చెప్పిన ఆయన, 152 నిమిషాల నిడివి ఉన్న చిత్రం ప్రేక్షకులను మైమరపిస్తుందని తెలిపాడు. రజనీ మాయ చేయడం గ్యారెంటీ అని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వివరించాడు. కాగా, ఈ చిత్రంలో రజనీ సరసన రాధికా ఆప్టే కథానాయికగా నటించగా, పా రంజిత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
#Kabali will be releasing worldwide on 22 July 2016 !! We couldn't be more excited @superstarrajini @beemji :) pic.twitter.com/HOll88EzuU
— Kalaippuli S Thanu (@theVcreations) July 11, 2016