: కేదారినాథ్ యాత్రికులకు చేదు వార్త.. హెలికాప్టర్ సర్వీసులకు వాతావరణం ఎఫెక్ట్!
కేదారినాథ్ యాత్రికులకు ఇది నిజంగా చేదువార్తే. శివ దర్శనానికి హెలికాప్టర్ సేవలు అందిస్తున్న 13 సంస్థల్లో 12 తమ సర్వీసులను రద్దు చేశాయి. సహకరించని వాతావరణం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలే ఇందుకు కారణమని ఆయా సంస్థలు పేర్కొన్నాయి. అయితే దేవభూమి ఎయిర్ సర్వీసెస్ అనే సంస్థ మాత్రం రుద్రప్రయోగ నుంచి సర్వీసులు అందిస్తోంది. సెప్టెంబరులో జరిగే రెండో విడతలో చాపర్ సర్వీసులు అందుబాటులోకి రానున్నట్టు సంస్థలు ప్రకటించాయి. హెలికాప్టర్ కంపెనీలు మే నుంచి జూలై వరకు కేదారినాథ్‌కు చాపర్లు నడుపుతుంటాయి. ఈ ఏడాది దాదాపు 2.5 లక్షల మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించగా, ఈ హెలికాప్టర్ సేవలను 58,000 మంది వినియోగించుకుంటున్నారు.