: కశ్మీర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత.. హ్యాండ్ గ్రనేడ్ దాడిలో 10 మంది జవాన్లకు గాయాలు


కశ్మీర్ ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో రేకెత్తిన ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనకారులు పోలీసులపై దాడులకు తెగబడుతూనే ఉన్నారు. తాజాగా తీవ్రవాదుల హ్యాండ్ గ్రనేడ్ దాడిలో పదిమంది సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఇప్పటి వరకు జరిగిన ఆందోళనల్లో మృతి చెందిన వారి సంఖ్య 30కి చేరుకుంది. కుల్గాంలోని దమ్హల్ హంజిపోరాలో ముగ్గురు పోలీసుల ఆచూకీ లభించడం లేదు. పోలీస్ స్టేషన్‌పై దాడిచేసిన దుండగులు ఆయుధాలు, పోలీస్ రికార్డులు, వైర్‌లెస్ సెట్లను ఎత్తుకుపోయారు. కాగా వరుసగా మూడోరోజు కూడా కశ్మీర్‌లో కర్ఫ్యూ కొనసాగుతోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి.

  • Loading...

More Telugu News